wait fr few seconds.. it will start playing automatically.
ప్రేయసి కావూ నేస్తం కావూ
గుండెల్లో నిండున్నావు
గుప్పెట్లో దాగున్నావూ
చీకట్లో వెలుగిస్తావూ
జగమంతా కనిపిస్తావూ
పండుగ నీవూ నా పచ్చిక నీవూ
మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగివున్నా
గాలిలో నీ కలా తేరుతున్నా
నింగిలో రాకలా చెదిరివున్నా
నీ శ్వాస కోసం మానై ఉన్నా
నీ మాట కోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై ఉన్నా
నీ నవ్వు కోసం అలుసై పోతా
జాబిలి కే వెన్నెల నీవూ
సూర్యుని కే వేకువ నీవూ
ఉపిరి కే ఉష్ణం నీవూ
ఉరించే తృష్ణం నీవూ
శూన్యం నీవూ నా శ్లోకం నీవూ
శూన్యం నీవూ నా శ్లోకం నీవూ
వేసవీ వర్షమై కురిసిపొవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పీ నన్నాదుకోవా
నీ తోడూ కోసం ఆవిరైపోనా
నీ స్పర్శ కోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుదినైపోనా
నీ గుండెలోకి సదినైరానా
నిలనికి నింగివి నీవూ
కాలానికి గమ్యం నీవూ
చలనానికి శక్తి వి నీవూ
భావానికి మూలం నీవూ
ఎవ్వరి కోసం జాబిలి దేశం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
ఎవ్వరి కోసం జాబిలి దేశం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
hi
this is sravani. First of all thanks for the lyrics but i found a mistake
గాలిలో ఈకలా తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరివున్నా
these are the right lyrics
Post a Comment